మహేష్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. ఇది జస్ట్ శాంపిల్!
on Aug 20, 2022
టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా దాదాపు అందరూ ఏదో ఒక సినిమాలో షర్ట్ లేకుండా కనిపించారు. కానీ మహేష్ బాబు బాబు మాత్రం ఇప్పటిదాకా షర్ట్ లేకుండా కనిపించలేదు. అయితే ఇప్పుడు మహేష్ కూడా రూట్ మార్చినట్లు ఉన్నాడు. తాజాగా ఆయన షర్ట్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహేష్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలను ఆయన భార్య నమృత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేష్ మొదటిసారి షర్ట్ లేకుండా ఈ కనిపించడంతో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను మహేష్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నియమించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ షర్ట్ లెస్ పిక్స్ చూస్తుంటే.. తన నెక్స్ట్ మూవీలో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నానని హింట్ ఇస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవవుతోంది.
మహేష్ ప్రస్తుతం తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ విభిన్న కథా చిత్రంలో మహేష్ కొత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. అంతేకాదు 'అరవింద సమేత'లో ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించిన త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ ని కూడా సిక్స్ ప్యాక్ లో చూపించబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి మహేష్ 'SSMB 28'లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ లో కనిపించి అలరిస్తాడేమో చూడాలి.
Also Read