మంచు విష్ణు... 'మోసగాళ్లు' ఎవరు?
on Nov 23, 2019
'మోసగాళ్లు' అంటూ వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు మంచు విష్ణు. మరి, ఆ మోసగాళ్లు ఎవరో?. మంచు విష్ణు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'చిలసౌ' ఫేమ్ రుహానీ శర్మ మరో హీరోయిన్. హిందీ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు జెఫ్రీ చిన్ దర్శకుడు. ఇతడు ఇంతకు ముందు ఇంగ్లీష్, చైనా భాషల్లో సినిమాలు తీశాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు 'మోసగాళ్లు' టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఐటీ స్కామ్ నేపథ్యంలో సినిమా తీస్తున్నారు. 'ది స్టోరీ ఆఫ్ వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్' అంటున్నారు. అది ఏమై ఉంటుందో? ఈ సినిమాలో అర్జున్ అనే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లలో అతడు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
