మన శంకర వరప్రసాద్ గారు హిందీ రీమేక్! ఈ హీరో మీకు ఓకేనా!
on Jan 21, 2026
.webp)
శంకర వర ప్రసాద్ బాలీవుడ్ కి వెళ్తాడా!
సినీ అభిమానులు ఏమంటున్నారు
ఆ హీరో పై మీ అభిప్రాయం ఏంటి
ఆనందాన్ని ఎవరు మాత్రం కోరుకోరు అని సిగరెట్ యాడ్ ద్వారా సినిమా మనకి మంచి చెప్తుంది. మరి సినిమా మంచిని కూడా మనం కోరుకోవాలి కదా. అందుకే సినిమా మంచిని కోరుకునే సినీ అభిమానులు ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మంచిని కోరుకుంటు ఒక డీల్ ని ప్రతిపాదనలోకి తీసుకొస్తున్నారు. మరి ఆ డీల్ వెనక ఉన్న మ్యాటర్ ఏంటో చూద్దాం.
సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు స్పందిస్తు 'జనవరి 12 న థియేటర్స్ లో అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారి(Mana Shankara Varaprasad Garu)విజయ వీరవిహారం ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఎంటైర్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా పట్టుమని పది రోజులు పూర్తవ్వకుండానే 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. అంతలా ప్రేక్షక లోకాన్ని మెస్మరైజ్ చెయ్యడానికి కారణం వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్స్ మధ్య నడిచే సబ్జెక్టు కి ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ని సమపాళ్లల్లో జోడించి తెరకెక్కించడమే. ఈ పాయింట్ యూనివర్సల్ ది కాబట్టి హిందీ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుంది. ఈ తరహా సబ్జెట్స్ ని బాలీవుడ్ లో ఎప్పట్నుంచో తెరకెక్కిస్తూనే ఉన్నారు. కాబట్టి అక్షయ్ కుమార్(Akshay Kumar),సల్మాన్ ఖాన్(Salman Khan) అజయ్ దేవగన్(Ajay devgn)షారుక్ ఖాన్(Shahrukh Khan)లో ఎవరో ఒకరు బాగుంటారు. ఈ నలుగురు ఇప్పటికే ఫ్యామిలీ టైపు ఆఫ్ సినిమాలో తమ సత్తా చాటారు.
Also read: నీకు పుణ్యం ఉంటుంది బాబు.. ఆ పని చేసి పెడతావా
కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఒకరు చేస్తే మన శంకర వరప్రసాద్ గారు హిందీలో కూడా సంచలన విజయం సాధించడంతో పాటు బాలీవుడ్ బీరువాల్లోకి రికార్డు కలెక్షన్స్ వచ్చి చేరతాయనే అభిప్రాయాన్ని సినీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ మంచి మాటలు బాలీవుడ్ హీరోలు, మేకర్స్ వద్దకి చేరి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మన శంకర వర ప్రసాద్ గారు టికెట్స్ కోసం థియేటర్స్ ముందు పడిగాపులు కాసే రోజు వస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



