Chiranjeevi: మరో హీరోని పెట్టు.. హిట్ కొట్టు.. చిరంజీవి కొత్త సెంటిమెంట్!
on Jan 21, 2026

మెగాస్టార్ నయా సెంటిమెంట్
మరో హీరోతో కలిసి సంక్రాంతికి వస్తే హిట్టే
నెక్స్ట్ సంక్రాంతికి కూడా సేమ్ సెంటిమెంట్
రీ-ఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఒక కొత్త సెంటిమెంట్ వచ్చి చేరింది. మరో హీరోని తన సినిమాలో భాగం చేసి, సంక్రాంతికి విడుదల చేస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పటికే ఇది మూడు సార్లు జరిగింది. నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఇదే సెంటిమెంట్ ని చిరంజీవి రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
2017 సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఖైదీ నెంబర్ 150'తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ లో చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి వచ్చిన రెండో సంక్రాంతి సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించడం విశేషం. 2023 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది.
ఇక ఈ 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో ప్రేక్షకులను పలకరించారు చిరంజీవి. ఇందులో వెంకీ గౌడ అనే ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ అలరించారు. ఈ మూవీ కూడా అదిరిపోయే వసూళ్లతో.. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ
ఇలా రీ ఎంట్రీ తర్వాత మూడు సంక్రాంతులకు ముగ్గురు హీరోలతో వచ్చి హిట్స్ కొట్టారు మెగాస్టార్. 2027 సంక్రాంతికి కూడా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.
బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి, 2027 సంక్రాంతికి తీసుకురావాలని చూస్తున్నారు. గత మూడు సంక్రాంతి సినిమాల్లాగే.. వచ్చే సంక్రాంతికి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి.. చిరు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



