తమన్‌ని తిడుతున్న మహేష్ ఫ్యాన్స్!
on Aug 7, 2020
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు తిట్ల దండకంతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 'అరే తమన్... నీకు పగులుతుంది' అని ఒకరు అంటే, మరొకరు 'నీకు గు... బలిసిందా?' అని, ఇంకొకరు 'నువ్ ముందు మంచి పాట రెడీ చెయ్ రా' అని అంటున్నారు. కొంతమంది బూతులు కూడా తిడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు. కరోనాతో యుద్ధం చేస్తున్న ఈ సమయంలో అందరూ సురక్షితంగా ఉండాలంటే సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలనీ, పుట్టినరోజు వేడుకలు వద్దని అభిమానులు మహేష్ విజ్ఞప్తి చేశారు. గొప్ప సూచన అని తమన్ అభిప్రాపడ్డారు. మహేష్ ట్వీట్‌ను ఆయన కోట్ చేశారు. ఇంగ్లిష్ లో 'గ్రేట్ బ్రదర్' అని కోట్ చేశారు.
మహేష్‌ను తమన్ 'బ్రదర్' అని సంబోధించడం అభిమానుల్లో కొందరికి నచ్చలేదు. గతంలో 'సార్' అనేవాడు అనీ, ఇప్పుడు పొగరు పెరగడంతో 'బ్రదర్' అంటున్నాడని తిట్టడం మొదలుపెట్టారు. 'మహేష్ అన్న సెన్సిటివ్ అయితే మేం ఊరమాస్' అని తిట్ల దండకం అందుకున్నారు కొందరు. 'నువ్ బ్రదర్ అన్న ప్రతిసారి నాకు గలీజ్ గా వినిపిస్తుంది. మ్యూజిక్ రిలేటెడ్ ట్వీట్స్ వేసుకో కానీ బాబు గురించి రెస్పాండ్ అవ్వకు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'బ్రదర్ ఏంట్రా లఫుట్. మహేష్ సర్ అను' ఎవరో తిట్టారు. "బ్రదర్ అనడంలో తప్పేముంది? అన్నా అనే కదా" అని కొందరు తమన్ కి సపోర్ట్ చేశారు.
Also Read