మహేశ్ మోకాలికి సర్జరీ...
on Jan 25, 2020
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోవడానికి అసలు కారణం మోకాలికి సర్జరీ చేయించుకోవాలని అనుకోవడమే అని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి మహేశ్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే సర్జరీ చేయించుకోవాలని ప్లాన్ చేశారట! కొన్నేళ్లుగా మోకాలి నొప్పితో మహేశ్ బాధపడుతున్నారు. భళ్లారిలో ‘ఆగడు’ షూటింగ్ చేసేటప్పుడు 2014లో ఆయన మోకాలికి గాయమైందట. అప్పట్నుంచి సర్జరీ చేయించుకోవడానికి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదట. ‘స్పైడర్’ తర్వాత ఒకసారి సర్జరీ చేయించుకున్నా ఎక్కువ రోజులు షూటింగ్‌కి దూరంగా ఉండకపోవడంతో సెట్ కాలేదట. అందుకని, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మూడు నెలలు ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌కి దూరంగా ఉండి, సర్జరీ చేయించుకుని పూర్తిగా నయమైన తర్వాత మళ్లీ సినిమా షూటింగులు స్టార్ట్ చేయాలనే డెసిషన్ తీసుకున్నాడట. అందుకని, అమెరికా వెళ్లారని టాక్. పైకి మూడు నెలలు అని చెబుతున్నా, పూర్తిగా కోలుకోవడానికి ఐదు నెలల సమయం పట్టవచ్చట.
విశ్రాంతి నుండి తిరిగొచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మహర్షి’ వచ్చింది. అది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఈసారి ఆ సినిమాకు కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండే సినిమా చేయనున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్‌ను మహేశ్ కోసం వంశీ పైడిపల్లి డిజైన్ చేశాడట.