విజయశాంతితో మహేష్ ఫేస్ టు ఫేస్
on Nov 21, 2019
జస్ట్... కొన్ని గంటల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ, సంక్రాంతికి విడుదల కానున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ప్రేక్షకుల ముందుకు ఇంటర్‌నెట్‌లో వచ్చేస్తుంది. ఇదెలా ఉండబోతుందోనని ఘట్టమనేని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కోపంగా చూస్తున్న మహేష్ కళ్లు మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ తో టీజర్ డేట్, టైమ్ అనౌన్స్ చేశారు. దాంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా, సినిమాపై అంచనాలను మరింత పెంచేలా అనిల్ రావిపూడి ఈ సినిమా టీజర్ కట్ చేశారట.
సినిమాలో మహేష్ సైనికుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి దేశభక్తి డైలాగులతో పాటు అభిమానుల చేత విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్ ఒకటి టీజర్ లో ఉంటుందట. సాధారణంగా తన ప్రతి సినిమాలో ఒక సిగ్నేచర్ డైలాగ్ పెట్టడం అనిల్ రావిపూడికి అలవాటు. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్లోనూ అటువంటి హుకప్, సిగ్నేచర్ డైలాగ్ ఒకటి ఉంటుందట. అన్నిటి కంటే ముఖ్యంగా విజయశాంతితో మహేష్ బాబు ఫేస్ టు ఫేస్ చెప్పే డైలాగులు అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ వంటిది ఏదో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read