అక్కడ టాటూ వేయించుకున్న హీరోయిన్
on Nov 21, 2019
తమిళంలో తన పేరును శృతి హాసన్ భుజం వెనుక టాటూగా వేయించుకున్నారు. తెలుగులో హాట్ యాంకర్ అనసూయ ఎదపై టాటూ వేయించుకున్నారు. త్రిష ఎదపై కూడా సీతాకోకచిలుక కనిపిస్తుంది. తమ శరీరంపై తమకు నచ్చిన ప్రదేశాల్లో టాటూలు వేయించుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తమ టాటూలు కనిపించేలా దుస్తులు వేసుకుంటారు. ఈ జాబితాలో ఆషిమా నర్వాల్ కూడా చేరారు.
తెలుగులో 'నాటకం', 'జెస్సీ' సినిమాల్లో నటించిన హాట్ హీరోయిన్ ఆషిమా నర్వాల్, రీసెంట్‌గా రెండు టాటూలు వేయించుకున్నారు. ఎక్కడో తెలుసా? రెండు కాళ్లపై. ఇంకా చెప్పాలంటే రెండు థైస్ (తొడల) మీద. అక్కడ టాటూ వేయించుకున్నానని చెప్పడం కోసం, ఆ టాటూలు కనిపించేలా దుస్తులు వేసుకుని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు ఈషా రెబ్బా మెయిన్ రోల్ లో సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న తెలుగు 'లస్ట్ స్టోరీస్'లో ఆషిమా నర్వాల్ నటిస్తుండటంతో ఆమెపై ప్రేక్షకుల కన్ను కాస్త పడుతోంది.
Also Read