మగధీరనీ కాపీ కొట్టేశారా?
on Oct 26, 2016
హాలీవుడ్ సినిమాల్ని చూసి రాజమౌళి కాపీ కొడుతుంటే... రాజమౌళి సినిమాల్ని చూసి దక్షిణాది వాళ్లు కాపీ కొడుతున్నారు. తాజాగా కార్తి నటించిన కాష్మోరా సినిమానే ఇందుకు ఉదాహరణ. కాష్మోరా ట్రైలర్ చూస్తే బాహుబలిలోని కొన్ని షాట్స్ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ అన్నీ... దాదాపుగా బాహుబలి సినిమాని పోలి ఉంటాయని టాక్. మరో విషయం ఏమిటంటే,.. కాష్మోరా మగధీరనీ కాపీ కొట్టిందట. మగధీరలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని పోలి.. కాష్మోరాలో ఓ ఎపిసోడ్ ఉందట. కాష్మోరాలోనూ పునర్జన్మల నేపథ్యం కనిపించనుంది. మగధీరలో ఓ ప్రేమజంట చనిపోయి.. మరో జన్మ ఎలా ఎత్తి కలుస్తారో... అలాంటి సన్నివేశాలే కష్మారోలో చూపించనున్నారట. అంటే కాష్మోరా అటు బాహుబలినీ, ఇటు మగధీరనీ కాపీ కొట్టేసిందన్నమాట. దాదాపు 90 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ కాష్మోరాకి ప్రధాన హైలెట్ కానున్నదని చిత్రబృందం చెబుతోంది. గ్రాఫిక్కులతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. బాహుబలి, మగధీరని కాపీ కొట్టేసినట్టు ఆడియన్స్‌కి అనిపిస్తే... కాష్మోరాకి కాళరాత్రే.