మ్యాడ్ స్క్వేర్ vs రాబిన్ హుడ్.. ఎవరిది పైచేయి..?
on Mar 27, 2025
సినిమాలకు వేసవి కూడా మంచి సీజన్. ఈ టైంలో స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయిపోతాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ తమ పిల్లలను తీసుకొని సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఎంటర్టైనర్స్ ఈ సీజన్ లో ఎక్కువగా ఆదరణకు నోచుకుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ వారం రెండు ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మార్చి 28న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు విడుదలవుతున్నాయి.
'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో శ్రీలీల హీరోయిన్. పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందిన 'రాబిన్ హుడ్'.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. (Robinhood)
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందటంతో 'మ్యాడ్ స్క్వేర్'పై మంచి అంచనాలే ఉన్నాయి. (Mad Square)
ఓ వైపు హిట్ కాంబినేషన్ లో వస్తున్న 'రాబిన్ హుడ్', మరోవైపు హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్'. రెండు సినిమాల్లోనూ కామెడీ ఉంది. 'రాబిన్ హుడ్' అనేది కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఫిల్మ్ కాగా, 'మ్యాడ్ స్క్వేర్' మాత్రం నవ్వించడమే టార్గెట్ రూపొందిన కామెడీ ఫిల్మ్. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
