నా ఆస్తులు తాకట్టులో ఉంటే ఎన్టీఆర్ ఏం చేసారో తెలుసా!
on Apr 5, 2025
ప్రముఖ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)గత నెల మార్చి 19 న 73 సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.బర్త్ డే వేడుకలు తిరుపతిలోని తన యూనివర్సిటీ లో జరగగా శరత్ కుమార్,ప్రభుదేవా హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మోహన్ బాబు ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో బిజీగా ఉన్నాడు.మంచు విష్ణు(Vishnu) 'కన్నప్ప'గా టైటిల్ రోల్ లో చేస్తుండగా ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి మేటినటులు కీలక పాత్రలు చేస్తున్నారు.మోహన్ బాబు కూడా ఒక కీలక క్యారక్టర్ లో నటించడంతో పాటు 'కన్నప్ప' కి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.
మోహన్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతు నాకు మొట్టమొదటి అవకాశం దాసరి నారాయణరావు(Dasari Narayanararao)గారు స్వర్గం,నరకంతో ఇచ్చారు.అప్పట్నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల క్యారక్టర్ లు వేసాను.కొన్నిసార్లు సినిమాలు ఫెయిల్ అయ్యాయి గాని,నటుడిగా మాత్రం నేను ఫెయిల్ అవ్వలేదు.నిర్మాతగా అన్నగారు నందమూరి తారకరామారావుతో మేజర్ చంద్రకాంత్ నిర్మించడంతో పాటు ఆయన కొడుకుగా నటించాను.నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మేజర్ చంద్రకాంత్ ని తెరకెక్కిస్తుంటే అలా వద్దని ఎన్టీఆర్ వారించారు.కానీ మొండిగా ఆ సినిమా నిర్మించి సక్సెస్ అయ్యాను
నేను ట్రోలింగ్ లని పట్టించుకోను.అలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో నాకు తెలియదు.పక్క వాళ్ళు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు.అలా కోరుకుంటే వాళ్ళ కంటే ముందే మనం నాశనం అవుతాం.కోపం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది.నేను ఎవరికీ అపకారం చెయ్యలేదు.నన్నేచాలా మంది మోసం చేశారు.ఒకర్నిమార్చాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు.అందరు క్షేమంగా ఉండాలి.దేవుడి దయ వల్ల 'కన్నప్ప'మూవీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
