బాయ్‌ఫ్రెండ్‌తో తాజ్‌మహల్‌ను సందర్శించిన రకుల్!
on Feb 21, 2022

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తన రిలేషన్‌షిప్ విషయాన్ని తన 31వ పుట్టినరోజు సందర్భంగా ధ్రువీకరించింది రకుల్ ప్రీత్‌సింగ్. అటు జాకీ కూడా అదే రోజు ఆమెపై తన ప్రేమను వెల్లడించాడు. చాలామంది వారి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి దాకా వారి అనుబంధం గురించి ఎలాంటి రూమర్స్ రాలేదు. కట్ చేస్తే, 2022లో తాజాగా జాకీతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించింది రకుల్. రకుల్ బ్లూ కుర్తీ ధరించగా, జాకీ వైట్ కుర్తా, డెనిమ్ ప్యాంట్స్ వేసుకుని కనిపించాడు.
రకుల్, జాకీ జంటగా తాజ్‌మహల్‌ను సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ రిలేషన్‌షిప్‌ను అఫిషియల్‌గా ప్రకటించిన తర్వాత కూడా ఆ ఇద్దరూ పబ్లిక్‌లో పెద్దగా కనిపించింది లేదు. దీంతో చాలా రోజుల తర్వాత ఆ లవ్ బర్డ్స్ జంటగా కనిపించడంతో రకుల్ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అయ్యారు.
2021 అక్టోబర్ 10న రకుల్‌తో తన రిలేషన్‌షిప్‌ను అఫియల్‌గా అనౌన్స్ చేశాడు జాకీ. రకుల్‌తో కలిసున్న ఒక లవ్‌లీ ఫొటోను షేర్ చేసిన అతను, "నువ్వు లేకుండా నాకు రోజులు రోజులుగా కనిపించవు. నువ్వు లేకుండా, అత్యంత రుచికరమైన ఆహారం కూడా నాకు ఆనందం కలిగించదు. నా లోకం అయిన అత్యంత అందమైన మనసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ రోజు నీ నవ్వు అంత వెలుగుగా, నీ అంత అందమైనదిగా ఉండాలని కోరుకుంటున్నా. నా రకుల్‌ప్రీత్‌కు హ్యాపీ బర్త్‌డే" అని రాసుకొచ్చాడు.
తెలుగులో ప్రస్తుతం ఏ సినిమా చేతిలో లేకపోయినా హిందీలో 'ఎటాక్', 'రన్‌వే 34', 'డాక్టర్ జి', 'థాంక్ గాడ్' లాంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రకుల్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



