లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం
on Feb 17, 2017

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి, నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ నివ్వగా, చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే అందమైన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. చక్కటి కథా, కథనాలతో పాటు మాటలు, పాటలు అన్ని అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ రచించిన స్వీటుగా చిన్నదుంది... చాటుగా ముద్దు ఉంది... నేర్చుకో లవ్వు పాఠం.... పిల్లా! నేర్చుకో లవ్వు పాఠం అనే గీతాన్ని ముగ్గురు నాయకానాయికలపై ఇటీవలే చిత్రీకరించాం. ఈ పాటకు ప్రేమలత నృత్యాలను సమకూర్చారు. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు. కాశీవిశ్వనాథ్, డా॥పరుచూరి గోపాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సమర్పణ: శరత్‌చెట్టి(యూఎస్‌ఏ)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



