ఆకతాయి పవన్ కళ్యాణ్ ని బాగా వాడుకున్నాడుగా!
on Feb 17, 2017

పవన్ కళ్యాణ్ కున్న క్రేజే వేరు. చాలామంది హీరోలకి అభిమానులుంటారు, కానీ పవన్ కళ్యాణ్ కి హీరోల్లో కూడా అభిమానులున్నారు. ఫాన్స్ ఆదరణ పొందే క్రమంలో చాలా మంది దర్శక నిర్మాతలు మరియు యువ హీరోలు, పవన్ పేరు బాగా వాడుకుంటున్నారు. ఒక విధంగా, పవన్ నామ మంచి ఓపెనింగ్స్ తెస్తుందనే నమ్మకం బాగా పెరిగిపోయింది. ఆకతాయి అనే చిన్న బడ్జెట్ సినిమాకి కూడా పవన్ క్రేజ్ వాడుకునే ప్రయత్నం చేసారు.
ఆకతాయి టీజర్ లో ప్రిధ్విరాజ్ ఒక డైలాగ్ చెప్తాడు, "పీకే ఫ్యాన్ ఇక్కడ... ఏకే 47 కన్నా డేంజర్". ఈ డైలాగ్ బుల్లెట్ సూటిగా పవన్ అభిమానుల గుండెలకి గుచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన అమీషా పటేల్ ఒక ప్రత్యేక పాటలో నర్తిస్తుండడం విశేషం. ఆశిష్ రాజ్ హీరో గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి బడ్జెట్ బాగానే పెట్టినట్టున్నారు. టీజర్ ఆసాంతం ఏదో ఒక ఆసక్తి రేపించే అంశం చుట్టూ తిరుగుతుంటుంది. హీరో, విలన్ 'ఢీ' సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అన్నీ పక్కన పెడితే, పవన్ ఫాన్స్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారో లేదో చూడాలి. అయినా, కంటెంట్ బాగుంటే, చిన్న సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేసిన సందర్భాలు కోకొల్లలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



