రజినీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
on Oct 29, 2021
సూపర్‌స్టార్ రజినీకాంత్ కొంతకాలంగా తరచూ ఆసుపత్రిపాలు కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజినీకాంత్ స్పందించారు.
గురువారం సాయంత్రం రజినీకాంత్ అకస్మాత్తుగా చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే రజినీ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని లతా అన్నారు. సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందవద్దని లతా పేర్కొన్నారు.
కాగా, రజినీకాంత్ నటించిన 'అన్నాత్తే' సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కానుంది. బుధవారం ఆయన 'అన్నాత్తే' స్పెషల్ షోను కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.