`ప్రేమమ్` హీరోతో అంజలి.. ఆ డైరెక్టర్‌తో నాలుగోసారి?
on Aug 5, 2021
పేరుకి తెలుగమ్మాయే అయినా నటిగా తమిళనాటే మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. మరీముఖ్యంగా.. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రామ్ రూపొందించిన `కట్రదు తమిళ్` (2007) చిత్రం అంజలికి నటిగా పేరు తీసుకువచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా రామ్ డెబ్యూ మూవీ కాగా.. అంజలికి తమిళంలో మొదటి సినిమా. ఆ తరువాత రామ్ మరో మూడు సినిమాలు చేస్తే వాటిలో అంజలి రెండు చిత్రాల్లో నటించింది. కట్ చేస్తే.. త్వరలో రామ్ దర్శకత్వంలో మరో సినిమాలో యాక్ట్ చేయబోతోంది అంజలి.
థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్, `ప్రేమమ్` ఫేమ్ నివిన్ పాల్ కథానాయకుడిగా నటిస్తుండగా.. అతనికి జోడీగా అంజలి కనిపించనుంది. ఓ ముఖ్య పాత్రలో ప్రముఖ హాస్య నటుడు సూరి దర్శనమివ్వనున్నాడు. ఈ ముగ్గురు పోషిస్తున్న పాత్రల చుట్టే ఈ సినిమా తిరగనుందట. అలాగే.. ఈ చిత్రంతో అంజలి ఫిల్మోగ్రఫీలో మరో బెస్ట్ మూవీ చేరడం ఖాయమంటున్నారు. మరి.. తన లక్కీ డైరెక్టర్ తో చేస్తున్న ఈ నాలుగో ప్రయత్నం మన తెలుగమ్మాయికి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. తెలుగులో అంజలి చివరసారిగా పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్`లో కనిపించింది. ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టిస్టారర్ `ఎఫ్ 3`లో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ఓ స్పెషల్ రోల్ చేస్తోందని సమాచారం.
Also Read