బర్త్ డే స్పెషల్ గా నాగ్ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్?
on Aug 5, 2021
కింగ్ నాగార్జున సాలిడ్ హిట్ చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో 2016 సంక్రాంతికి వచ్చిన `సోగ్గాడే చిన్ని నాయనా`తో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఆ తరువాత మాత్రం అయితే యావరేజెస్, లేదంటే ఫ్లాప్స్ అన్నట్లుగా నాగ్ ఫిల్మోగ్రఫీ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో నెక్స్ట్ వెంచర్స్ పై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ప్రస్తుతం నాగ్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు మూవీ కాగా.. మరొకటి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ `బంగార్రాజు`. వీటిలో ప్రవీణ్ సత్తారు డైరెక్టోరియల్ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. `బంగార్రాజు` అతి త్వరలో పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 29 నాగ్ 62వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రవీణ్ సత్తారు మూవీ నుంచి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఉండబోతోందట. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటంటే.. నాగ్ - ప్రవీణ్ కాంబినేషన్ ఫిల్మ్ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారట. ఇంతకీ.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే ఆగస్టు 29వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రవీణ్ సత్తారు డైరెక్టోరియల్ లో నాగార్జునకి జంటగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇందులో నాగ్ మాజీ `రా` ఏజెంట్ గా కనిపించనుండగా.. `రా` ఏజెంట్ పాత్రలో కాజల్ దర్శనమివ్వనుంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఆగస్టు 4 నుంచి కొత్త షెడ్యూల్ షురూ చేశారు నాగ్. చకచకా సినిమాని పూర్తిచేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతోనైనా కింగ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
Also Read