లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కి కరోనా.. ఐసీయూలో చికిత్స!
on Jan 11, 2022

ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచన వెల్లడించారు.
92 ఏళ్ల లతా మంగేష్కర్ కి స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆమె వయస్సు, ఇతర అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 2019 నవంబర్ లో ఆమె శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు ఆమె కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



