లక్ష్మీ మంచు అంతమాట అనేశారేంటి?
on Apr 28, 2020
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'పిల్ల జమిందార్' సినిమా చూశారా? అందులో ఎమ్మెస్ నారాయణ తెలుగు మాస్టారుగా నటించారు. మల్లి, మళ్లీ పదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరంగా విడమరిచి మరి చెప్పారు. ఒక పదం తప్పుగా రాస్తే ఆ వాక్యం అర్థమే మారిపోతుంది. తెలుగులో అనర్గళంగా సుదీర్ఘమైన డైలాగులు చెప్పగలిగే కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు అటువంటి తప్పు ఒకటి చేశారు.
"అమ్మ మల్లె పువ్వులు పెట్టింది. మా తోటలో పూలు" అనే క్యాప్షన్ తో మల్లెపూలు పెట్టుకుని కుమార్తె విద్యా నిర్వాణ తో దిగిన ఫోటోను లక్ష్మి మంచు ట్వీట్ చేశారు. మల్లె బదులు మాలి అని రాశారు. ఒక నెటిజన్ ఆ తప్పును పాయింట్ అవుట్ చేశారు. ''మాలి కాదు అది. మల్లె" అని లక్ష్మీ మంచుకి చెప్పారు. ఆవిడ తప్పు సరిదిద్దుకోపోగా... "పోబే" అని రిప్లై ఇచ్చారు. అది అందరికీ షాక్ ఇచ్చింది. లక్ష్మీ మంచు అంతమాట అనేశారేంటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.