కమల్ వల్లే వెనక్కి వెళ్లి, ముందుకొచ్చిన రజినీకాంత్
on Dec 23, 2017

సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ గా మన్ననలు అందుకుంటూ... లేటు వయసులో కూడా కుర్ర హీరోలని క్రాస్ చేసి తమిళంలో నెంబర్ వన్ హీరో స్థానంలోదశాబ్దాలుగా కొనసాగుతున్నాడు రజినీకాంత్. అలాంటి రజినీ, తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు పలుమార్లు సంకేతాలు పంపించాడు. అభిమాన సంఘాలు, కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన పుట్టినరోజు నాడు అధికారికంగా ప్రకటిస్తాడు అని ఎదురు చూసిన వారిని నిరుత్సాహపరుస్తూ, రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి నోరు మెదపలేదు. అయితే, ఈ విషయంలో ఇప్పుడు పక్కా సమాచారం వచ్చింది. రజినీకాంత్ కి అత్యంత సన్నిహితుడయిన ప్రముఖ రాజకీయ నాయకుడు మణియన్ చెప్పిన మాటలతో రజని రాజకీయ తెరంగ్రేటం దాదాపు ఖరారయింది.
రజినీకాంత్ తో దాదాపు గంటకు పైగా చర్చించిన తర్వాత మణియన్ మీడియా కి క్లారిటీ ఇచ్చాడు. రజని త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేస్తున్నాడని... ఈ నెల 26 నుండి 31 మధ్య ఎప్పుడైనా ప్రకటన రావొచ్చని వెల్లడించారు. మణియన్ స్టేట్మెంట్ తో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో మొదలయ్యే రజనితో భేటీ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, రజినీకాంత్ మధ్యలో 'యూ' టర్న్ తీసుకోవడానికి... ఇప్పుడు మళ్ళీ వచ్చేందుకు సుముఖత చూపడానికి కమల్ హాసనే కారణమట. తాను అనౌన్స్ చేద్దాం అనుకున్న సమయంలో కమల్ హడావిడిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించడంతో, రజినీ వెనకడుగు వేసాడట. ఎందుకంటే తాను తమిళుడిని కాదు అనే విషయం మళ్ళీ తెరపైకి వస్తుంది కాబట్టి. సినీ రంగంలో తనను పోటీగా చూసిన కమల్, పాలిటిక్స్ లో కూడా అదే వైఖరితో ఉండడంతో, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అని నిర్ణయించుకున్నాడట. మరి కమల్ డీఎంకే కి సన్నిహితంగా మెదులుతున్నాడు కాబట్టి, రజినీ ఎవరితో కలుస్తాడో చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



