హలో హీరోయిన్ ఇంతకు ముందు ఎలా ఉండేదో చూస్తే షాకవుతారు
on Dec 23, 2017

అఖిల్ మొదటి సినిమా అఖిల్ ఫ్లాపవడంతో, రెండవ సినిమా విషయంలో అతి జాగర్త పడ్డారు నాగార్జున. తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మనం లాంటి సినిమా ఇచ్చిన విక్రమ్ కుమార్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగ్, టాప్ టెక్నీషన్స్ ని రంగంలోకి దించాడు. హీరోయిన్ విషయంలో మల్లగుల్లాలు పడ్డ నాగ్-విక్రమ్, చివరకు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నిన్నటి తరం హీరోయిన్ లిస్సీ ల గారాల పట్టి కళ్యాణి ప్రియదర్శన్ ని ఫైనలైజ్ చేశారు. పోస్టర్స్ లో, టీజర్ లో అందంగా కనిపించిన కళ్యాణి, సినిమాలో కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. నటనపరంగా కూడా మంచి మార్కులు సంపాదించిన కళ్యాణి, సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేదో చూస్తే షాకవుతారు.

బొద్దుగా, కళ్ళజోడు పెట్టుకొని అసలు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి కూడా కష్టమే అన్నట్టుగా ఉండేది. కానీ, ఎప్పుడయితే సినిమాల్లోకి వెళ్దాం అని నిర్ణయించుకుందో బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టింది. అతి తక్కువ సమయంలో, సన్న బడి హలో దర్శక నిర్మాతల కళ్ళలో పడింది. కళ్యాణి ఆకారంలో అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో మీరు గమనించండి...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



