కాజల్ బర్త్ డే ట్రీట్: `ఆచార్య` స్పెషల్ పోస్టర్?
on Jun 4, 2021

`ఆచార్య`లో మెగాస్టార్ చిరంజీవి.. టైటిల్ రోల్ లో దర్శనమివ్వనున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. `సిద్ధ`గా సందడి చేయనున్నారు. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే.. `నీలాంబరి`గా పలకరించనున్నారు. మరి.. `పంచదార బొమ్మ` కాజల్ అగర్వాల్ సంగతేంటి? ఫస్ట్ సింగిల్ ``లాహే లాహే``లో ట్రెడిషనల్ లుక్ లో కాజల్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ.. ఆమె పాత్రకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే.. కాజల్ బర్త్ డే ని పురస్కరించుకుని జూన్ 19న `ఆచార్య` నుంచి స్పెషల్ పోస్టర్ రాబోతోందట. ఎంతో స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కాజల్ అభిమానులను ఖుషీ చేసేలా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తమ్మీద.. మరో రెండు వారాల్లో `ఆచార్య జోడీ` కబుర్లు స్పెషల్ పోస్టర్ రూపంలో రాబోతున్నాయన్నమాట.
కాగా, చిత్రీకరణ తుది దశకు చేరుకున్న `ఆచార్య`కి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. చిత్రీకరణని పునః ప్రారంభించనున్నారు. విజయదశమి కానుకగా ఈ సోషల్ డ్రామాని విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



