జానీ మాస్టర్ కి బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఈ నెల 8 ఢిల్లీ వెళ్లనున్న జానీ మాస్టర్
on Oct 3, 2024

తోటి డాన్సర్ పై లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)ని తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు కోర్టు లో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కి అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో గత పది రోజుల పై నుంచి జానీ మాస్టర్ జైలులో ఉన్నాడు.
కాగా జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు.బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ధనుష్ నటించిన తిరు(tiru)సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కిందని, ఆ అవార్డు ని అందుకోవడం కోసం బెయిల్ ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. దీని పై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్ కు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 8న ఢిల్లీలో అవార్డు జానీ మాస్టర్ అవార్డు తీసుకోనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



