జగపతిబాబుని తిట్టిన స్టార్ హీరో
on Jan 16, 2022

ఫ్యామిలీ ఆడియన్స్ కి శోభన్ బాబు తరువాత ఆ స్థాయి హీరోగా ఆరాధ్య నటుడిగా పేరు తెచ్చుకున్నహీరో జగపతిబాబు. `శుభలగ్నం`, మావిడాకులు వంటి చిత్రాలకు మహిళా ప్రేక్షకులకు చేరువైన జగపతిబాబు `లెజెండ్` సినిమాతో విలన్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరో స్థాయికి వెళ్లింది. వరుసగా విలన్ అవకాశాలతో దూసుకుపోతున్నారాయన. హీరోగా ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నారాయన.
అయితే తనకు హీరో ట్యాగ్ టైన్ మాత్రమే ఇష్టమని చెబుతున్నారాయన. ఇదిలా వుంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. `అరవింద సమేత వీర రాఘవ` సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇందులో ఆయన కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి పాత్రలో నటించారు. ఈ చిత్రం సమయంలో తనని తారక్ తిట్టాడని, పనిష్ చేశాడని జగపతిబాబు చెప్పడం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడట. అంటే తిట్ల దండకం చదివేవాడట. నీ పాత్ర ఇంత బావుంది. అంత బావుందనేవాడట. అంతే కాకుండా రకరకాలుగా తిట్టేవాడట. అది కూడా ప్రేమలోనే అని చెప్పారు జగపతిబాబు. ఈ మూవీ రిలీజ్ తరువాత జరిగిన ఫంక్షన్ లోనూ జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర గురించే ఎన్టీఆర్ మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీ గురించి మాట్లాడుకున్నప్పుడు ముందు నా గురించి మాట్లాడతారని, ఆ తరువాతే తను గుర్తొస్తానని ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా పెద్దది` అని చెప్పుకొచ్చారు జగపతిబాబు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



