సినిమాలకు శ్రీకాంత్ గుడ్ బై
on Jan 27, 2016
వంద సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు శ్రీకాంత్. ఆ తరవాతే.. తన జోరు బాగా తగ్గిపోయింది. హీరోగా చేస్తున్న సినిమాల్నీ ఆగిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాల్లేవు. తాజాగా మెంటల్ పోలీస్ అనే సినిమా రెడీ అయ్యింది. బాజ్జీ దర్శకత్వం వహించారు. ఆపరేషన్ దుర్యోధన, ఖడ్గం.. తరవాత శ్రీకాంత్ చేసిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇదే.. అంటూ పబ్లిసిటీ ఇచ్చుకొంటున్నారు. మెడలో చెప్పులదండ వేసుకొన్న శ్రీకాంత్ పోస్టర్ టిపికల్‌గానే ఉంది.
శ్రీకాంత్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే.. శ్రీకాంత్ హీరోగా శాశ్వతంగా దూరమైపోయినట్టే. ఎందుకంటే శ్రీకాంత్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ దారుణంగా పడిపోయింది. శాటిలైట్‌ని నమ్ముకొని సినిమాలు తీసే పరిస్థితి కూడా లేదు. అందుకే తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు `శాటిలైట్ కూడా రాని నాతో సినిమా ఎందుకు` అని మొహం మీదే చెప్పేస్తున్నాడట. శ్రీకాంత్ తనయుడు రోషన్... కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడిప్పుడు. తనయుడికి ఓ హిట్టు పడగానే శ్రీకాంత్ సైడ్ అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. మెంటల్ పోలిస్ ఏమాత్రం కిక్ ఇచ్చినా.. శ్రీకాంత్ నిర్ణయంలో మార్పు వస్తుందేమో?