‘ఉస్తాద్ భగత్ సింగ్’ డైలాగ్‌ను లీక్ చేసిన హరీష్ శంకర్
on Aug 16, 2024
స్టార్ మాలో "మా వరలక్ష్మి వ్రతం" పేరుతో ఆదివారం ఒక ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఉదయభాను యాంకర్ గా వచ్చింది. అలాగే ఏ షో ఐనా కూడా తప్పనిసరిగా కనిపించే ఆది, ఆటో రాంప్రసాద్ మాత్రం ఈ షోలో అసలు కనిపించలేదు. అలాగే ఏ షోకైనా యాంకర్ శ్రీముఖి అన్న బ్రాండ్ ఉంది. కానీ ఈ షోని ఉదయభాను హోస్ట్ చేసింది. అలాగే బుల్లితెర నటీమణులంతా వచ్చారు. కమెడియన్స్ గా వచ్చిన గెస్టులను నవ్వించేలా చేయడానికి అవినాష్, ఇమ్మానుయేల్ ఉన్నారు.
ఐతే ప్రియాంక జైన్ ని ఇమ్ము ఒక ప్రశ్న అడిగాడు. "ఇంతలా రెడీ అయ్యి వచ్చారు మీకు ఇంతకు లక్ష్మి దేవి ఎవరో తెలుసా" అని అడిగేసరికి "తెలుసు ...కమలం పువ్వు మీద కూర్చుని ఉంటారు చేతిలో వీణ ఉంటుంది" అని జవాబిచ్చేసరికి ఇమ్ము షాకైపోయాడు. "ఒరేయ్ సరస్వతి దేవికి, లక్ష్మి దేవికి తేడా తెలియని వాళ్ళను తీసుకొచ్చి ఈవెంట్ చేస్తావా" అని అవినాష్ ని బాదేశాడు. "ఈ ఈవెంట్ కి రీల్స్, వ్లాగ్స్ ని చేసుకునేవాళ్లను తీసుకొస్తావా..ఎవరి కెమెరా ఏదో కూడా అర్ధం కావడం లేదు" అని సీరియస్ అయ్యాడు ఇమ్ము. ఇక ఈ షోకి హరీష్ శంకర్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో అవినాష్ ఒక ప్రశ్న అడిగాడు. "ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా రివీల్ చేయని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ చెప్పాలి" అని అడిగాడు "నాది సనాతన ధర్మం, నేను పాటించేది పరమత సహనం నా సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం 24 గంటలు నేను డ్యూటీలో ఉంటా" అని చెప్పి పవన్ మ్యానరిజమ్ ని ఇమిటేట్ చేసి చూపించేసరికి స్టేజి మొత్తం ఈలలు, గోలలతో నిండిపోయింది.