ప్రభాస్ స్పీడ్ కి బ్రేకులు వేసిన మహేష్
on Jan 9, 2024
అదేంటో గాని సూపర్ స్టార్ మహేష్ బాబు( mahesh babu) ఎప్పుడు వచ్చినా కూడా అంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని ఒక మూలన పడేసేలా చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడు.ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చామని కాదన్నాయ్ బుల్లెట్ దిగిందా లేదా అనే రీతిలో గుంటూరు కారం (guntur kaaram)తో నయా రికార్డు ని సృష్టించాడు.దీంతో తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తమంతట తాముగా పక్కకి తప్పుకుంటున్నాయి.
మొన్న గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో పేరు పెట్టడానికి కూడా వీలులేని స్థాయిలో రికార్డు వ్యూస్ ని సాధించింది. కేవలం ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే 39 మిలియన్స్ వ్యూస్ ( 39 million views)ని సొంతం చేసుకొని ప్రేక్షకుల్లో మహేష్ స్టామినా కి ఉన్న పవర్ ని తెలియచేస్తుంది. పైగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని తెలుగు మూవీ ట్రైలర్స్ కి వచ్చిన వ్యూస్ కంటే గుంటూరు కారంకే ఎక్కువ వ్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. బాబు ల్యాండ్ అయ్యాడంటే అపోజిషన్ కి బాండే అంటు సంబరాల్లో మునిగిపోయారు.
గుంటూరు కారం ట్రైలర్(guntur kaaram trailer)చూస్తుంటేనే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే చిత్రంగా త్రివిక్రమ్ (trivikram) తెరకెక్కించినట్టు చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. అలాగే మహేష్ కూడా వీర లెవల్లో విజృంభణ చెయ్యటం కూడా ఖాయమని తేలిపోయింది.ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ ( prabhas)నటించిన సలార్ ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్ తో ఇప్పటివరకు ముందంజలో ఉంటే గుంటూరుకారం ఆ రికార్డు ని పక్కకి నెట్టి ఇప్పుడు 39 మిలియన్స్ వ్యూస్ తో టాప్ లో ఉండటం గమనార్హం. సో ఈ సంక్రాంతికి మహేష్ సునామీ పక్కా..
Also Read