GlobeTrotter: సౌండ్ లేకుండా వచ్చిన సాంగ్.. రెస్పాన్స్ ఎలా ఉంది?
on Nov 11, 2025

సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఆడియన్స్ ని ఎలా ఎగ్జైట్ చేయాలో దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది.
రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ని SSMB29/గ్లోబ్ ట్రాటర్(GlobeTrotter) వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఈ మూవీ ఈవెంట్ నవంబర్ 15 సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
'గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్' పేరుతో జరగనున్న ఈ వేడుకలో మూవీ టైటిల్, మహేష్ లుక్ రివీల్ చేయడంతో పాటు.. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈవెంట్ కన్నా ముందే, రాజమౌళి వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇటీవల కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా గ్లోబ్ ట్రాటర్ సాంగ్ ని విడుదల చేసి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. శృతి హాసన్, కాలభైరవ ఆలపించారు. అసలు ఈ సాంగ్ ని రిలీజ్ చేయడమే సర్ ప్రైజ్ అంటే.. సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
Also Read: ఈ వారం సినీ ప్రియులకు పండగే.. సినిమాలు, సిరీస్ లతో సందడే సందడి!
"కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే" అంటూ సాగిన ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కీరవాణి సంగీతం, చైతన్య ప్రసాద్ సాహిత్యం ఎంత బాగున్నాయో.. అంతకుమించి అనేలా శృతి హాసన్ గాత్రం పవర్ ఫుల్ గా ఉంది.
మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపేలా "సంచారి.. సంహరి" అంటూ ఈ పాట సాగింది. అతను ప్రపంచాన్ని చుట్టేసే యాత్రికుడు అని చెబుతూనే, రాక్షసులను సంహరించే ధీరుడు అన్నట్టుగా లిరిక్స్ ఉన్నాయి. మృత్యువుపై సవారీ అన్నట్టుగా తన ప్రయాణం ఉంటుందని లిరిక్స్ తెలుపుతున్నాయి. మొత్తానికి ఇందులో మహేష్ పాత్ర యొక్క ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్ ని పంచేలా ఉంటుందని అర్థమవుతోంది.
గ్లోబ్ ట్రాటర్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటంతో పాటు, ట్రెండింగ్ లో ఉంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే కొద్దిరోజులుగా మూవీ టీం 'గ్లోబ్ ట్రాటర్'(GlobeTrotter) పేరుతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. అదే టైటిల్ గా ప్రకటించినా ఆశ్చర్యంలేదు.
'RRR' సినిమాకి కూడా మొదట ఆ టైటిల్ అనుకోలేదు. అది ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వడంతో దానినే టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' కూడా ఆడియన్స్ లోకి బాగా వెళ్ళడంతో.. దీనినే టైటిల్ గా ఫిక్స్ చేస్తారేమో అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



