మా నాన్న ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నాడు.. చనిపోయారనేది అబద్దం
on Nov 10, 2025

భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ధర్మేంద్ర(Dharmendra)కి ఉన్న సినీ చరిష్మా అంతో ప్రతేకమైనది. యాక్షన్ హీరోగా ,ఎవర్ గ్రీన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై తన కంటు ఒక చరిత్రనే సృష్టించుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటు ఉన్నాడు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారనే వార్తలు దాదాపుగా అన్ని మీడియా ఛానల్స్ లో ప్రసారమవుతున్నాయి.
ఈ వార్తలపై ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ స్పందించడం జరిగింది.ఆమె మాట్లాడుతూ మా నాన్నకి ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతుంది. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మేము నాన్న గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పేవరకు ఎవరు ఎలాంటి వార్తలు ప్రచారం చెయ్యవద్దని చెప్పుకొచ్చింది. ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రకాశ్ కౌర్ కాగా, ఇంకొకరు హేమమాలిని. భారతీయ సినిమా రంగంలో నటిగా హేమమాలిని సృష్టించిన సంచలనం అందరకి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి డ్రీమ్ గర్ల్ గా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. ఆ ఇద్దరు రీసెంట్ గా తమ చిత్రాలతో సందడి చేస్తు వస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు ఇషా డియోల్ ,అహనా డియోల్ కూడా నటన పరంగా బాలీవుడ్ లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు.ఇషా డియోల్ హీరోయిన్ గాను చేస్తున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



