అదృష్టమంటే హాసినిదే
on Dec 2, 2014
హాసిని గుర్తుందా.. బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ తో మంచి గుర్తింపు పొందిన జెనీలియా... బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే అంటే 25 నవంబర్ రోజున ఈమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. శనివారం రోజు జెనీలియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఆ ఫోటోలు బయటికొచ్చాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫోజులిస్తూ జెన్నీ సందడి చేసింది.
పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ముందూ సినిమాల్లో నటించే అవకాశం కూడా లేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఏదేమైనా తన జనరేషన్ హీరోయిన్లు ఇంకా సినిమా పరిశ్రమలోనే కొనసాగుతూ డక్కామొక్కీలు తింటుంటే ... జెనీలియా మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. హాసిని పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా మామూలు కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆమె భర్త పేరు రితేశ్ దేశ్ ముఖ్.... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు. అన్నింటికి మించి రితేశ్ బాలీవుడ్ నటుడు. వరుస సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. ఇలాంటి భర్త.... ఆపైన పండంటి బాబు... ఇంతకంటే ఓ అమ్మాయికి కావాల్సింది ఏముంది...ఎంతైనా అదృష్టమంటే జెన్నీదే. అది రీల్ లైఫ్ లో అయినా.. రియల్ లైఫ్ లో అయినా...