సునీల్ తో కలిసి సైలెంట్ గా వస్తున్న హెబ్బా పటేల్!
on Aug 25, 2022
గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం 'గీత'. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న 'గీత' చిత్రం సెప్టంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. 'నువ్వే కావాలి' ఫేమ్ సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు. ఆడియో వేడుకలో మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని 'గీత' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే 'గీత' విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు" అన్నారు.
నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... 'గీత' చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అన్నారు.
సునీల్, హెబ్బా పటేల్ 'గీత' వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. 'గీత' చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎస్.చిన్నా అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా క్రాంతికుమార్.కె పనిచేశారు.
Also Read