మరో పోలిటికల్ హీరో ఎంట్రీ!
on Jul 12, 2016
మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజకీయ నాయకుడు లేదా సినిమా కథానాయకుడికి ఉన్న పాపులారిటీ కొన్ని వేల కోట్లు సంపాదించే బిజినెస్ మ్యాన్లకు కూడా ఉండదు. అందుకే అందరికీ రాజకీయాలంటే పిచ్చి, సినిమాలంటే వ్యామోహం. ఇప్పటికే రాజకీయ నేపధ్యం ఉన్న కథానాయకుడిగా పేరు తెచ్చుకొన్న నారా వారి అబ్బాయి రోహిత్ కు పోటీగా మరో పోలిటికల్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఆంధ్రా మినిస్టర్ అయిన గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ త్వరలో కథానాయకుడిగా పరిచయమవ్వనున్నాడు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం అతి త్వరలో హైద్రాబాద్ లో జరగనుంది. ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది!