కేసిఆర్ కి షాక్..మంచిదే అంటున్న జబర్దస్ రాకింగ్ రాకేష్
on Nov 14, 2023

ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపుని పొందిన నటుడు రాకింగ్ రాకేష్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే రాకేష్ ఇటీవలే నిర్మాతగా మారి తనే హీరోగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జీవిత కథతో ఒక సినిమాని ప్రారంభించాడు. షూటింగ్ ని కూడా పూర్తిచేసుకొని విడుదలకి సిద్ధం అవుతున్న వేళ కేసిఆర్ మూవీకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.
రాకింగ్ రాకేష్ కేసిఆర్ జీవిత కథని ఆధారంగా చేసుకొని కేసిఆర్ అనే టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కించాడు. కేసిఆర్ అంటే కేశవ చంద్ర రమావత్ అనే పేరు అని టైటిల్ లోగోలో క్లియర్గా చెప్తున్నా కూడా సినిమా మాత్రం కేసిఆర్ జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. శరవేగంగా షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఈ కేసిఆర్ మూవీ ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతున్న వేళ తెలంగాణ ఎన్నికల కమిషన్ కేసిఆర్ మూవీ విడుదల కాకుండా ఆర్డర్ పాస్ చేసింది. ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయాలకి సంబంధించిన ఇలాంటి సినిమాలు ప్రజల్ని ప్రేరేపించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తు కేసిఆర్ సినిమాని నిలుపుదల చేసింది. అంటే ఇక కేసిఆర్ మూవీ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాతే విడుదల అవ్వబోతుంది.
తన సినిమా విషయంలో జరిగిన పరిణామాలపై రాకింగ్ రాకేష్ మాట్లాడుతు ఎలక్షన్ కమిషన్ నా కేసిఆర్ సినిమాని ఆపడం వలన నాకు మంచే జరిగిందని ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మూవీ ప్రమోషన్స్ ని మరింత బాగా చేసుకోవడానికి వీలుంటుందని ఎవరి బలవంతం మీదనో నా సినిమాని ఎలక్షన్ కమిషన్ ఆపలేదని రాకేష్ బదులిచ్చాడు. ఈ కేసిఆర్ మూవీలో రాకింగ్ రాకేష్ సరసన అనన్య హీరోయిన్ గా నటించగా గరుడువేగ అంజి దర్శకత్వం వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



