ద్వారక : టీజర్ రివ్యూ
on Oct 17, 2016
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు విజయ్ దేవరకొండ. రూ.కోటి రూపాయలతో తీసిన ఆ సినిమా ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. అంటే రూపాయికి పదిహేను రూపాయలు లాభం అన్నమాట. అందుకే ఈ కుర్ర హీరో క్రేజ్ పెరిగింది. పెళ్లి చూపులు తరవాత విజయ్ నుంచి వస్తున్న సినిమా `ద్వారక`. పూజా జావేరి కథానాయికగా నటించిన ఈచిత్రానికి శ్రీనివాస రవీంద్ర దర్శకుడు. తాజాగా ద్వారక ట్రైలర్ బయటకు వచ్చింది. ఇదో రొమాంటిక్ కామెడీ సినిమా. దొంగ బాబాగా కథానాయకుడు చేసే చిలిపి వేషాలే ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ అనిపిస్తోంది. కథానాయకుడు అనుకోని పరిస్థితుల్లో బాబాగా అవతారం ఎత్తడం, తనకి పాపులారిటీ పెరగడం, ఈలోగా ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకోవడం.. ఇదీ కథ. లైన్ కొత్తగానే ఉంది. కానీ.. తెరపైచూపించిన విధానం ఎలా ఉందో తెలియాలంటే ద్వారక రావల్సిందే. ఈ సినిమాలోని ట్విస్టులూ, టర్న్‌లూ అన్నీ ట్రైలర్‌లోనే కనిపించేస్తున్నాయి. ట్రైలర్‌లోనే అంతా చూపించేస్తే.. మరి సినిమాలో ఏం మిగిల్చారో. ఓవరాల్‌గా ఈ ట్రైలర్ ఓకే అనిపించింది అంతే. తప్పకుండా ఈసినిమా చూడాల్సిందే అనే కుతూహలం మాత్రం కలగలేదు. పూజా జావేరితో హీరో చేసిన లిప్‌లాక్ ఈ ట్రైలర్‌లోని ఇంట్రస్టింగ్ మూమెంట్. అది తప్ప... పెద్దగా ఆకర్షించే విషయాలేం ఈ టీజర్లో లేనట్టే.