2021 జ్ఞాపకాలుః ట్రాక్ తప్పిన దర్శకులు!
on Dec 22, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో బోయపాటి శ్రీను, గోపిచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల, భాస్కర్ వంటి ప్రముఖ దర్శకులు మళ్ళీ విజయాలతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తే.. వీరికి భిన్నంగా ప్రీవియస్ మూవీస్ తో మంచి హిట్స్ చూసిన కొంతమంది కెప్టెన్స్ మాత్రం ట్రాక్ తప్పారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ట్రాక్ తప్పిన ఆ దర్శకులంతా ఫెస్టివల్ స్పెషల్ గా రిలీజైన మూవీస్ తోనే ఈ ఫలితాలను పొందారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి`, `మజిలీ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన టాలెంటెడ్ కెప్టెన్ శివ నిర్వాణ.. ఈ సంవత్సరం `టక్ జగదీశ్`తో పలకరించాడు. తన తొలి చిత్ర కథానాయకుడు నేచురల్ స్టార్ నానితో శివ తీసిన ఈ ఫ్యామిలీ డ్రామా.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయింది. గత చిత్రాలకు భిన్నమైన ఫలితాన్ని ఈ సినిమాతో పొందాడు శివ.
ఇక మొదటి సినిమా `ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం సాధించిన టాలెంటెడ్ కెప్టెన్ అజయ్ భూపతి.. మూడేళ్ళ గ్యాప్ తరువాత ఈ ఏడాది `మహా సముద్రం`తో పలకరించాడు. శర్వానంద్, సిద్ధార్ధ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. విజయదశమి కానుకగా అక్టోబర్ 14న థియేటర్స్ లో రిలీజైంది. అనూహ్య పరాజయం పాలైంది.
అలాగే `ప్రతి రోజూ పండగే` వంటి బ్లాక్ బస్టర్ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి నుంచి వచ్చిన `మంచి రోజులు వచ్చాయి` కూడా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. హిట్ లిస్ట్ లో చేరలేకపోయింది.
మరి.. 2021లో అనుకున్న ఫలితాలను అందుకోలేకపోయిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్.. రాబోయే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



