బిగ్ ట్విస్ట్.. సూపర్ స్టార్ సినిమా నుండి తప్పుకున్న డైరెక్టర్!
on Nov 13, 2025

సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి దర్శకులందరూ ఆసక్తి చూపుతారు. అలాంటిది అధికారికంగా ప్రకటించిన ఒక భారీ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకునే సాహసం చేస్తాడా?. తాజాగా ఓ దర్శకుడు అదే పని చేసి షాకిచ్చాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా సుందర్ సి పేరుని కూడా ప్రకటించారు.

Also Read: ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?
'తలైవా 173'(Thalaivar173) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా దర్శకుడు సుందర్ ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి హృదయానికి కష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సుందర్ తెలిపారు.
ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి, 'తలైవా 173'కి తగిన సమయాన్ని కేటాయించలేకనే సుందర్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ విషయంలో రజినీకాంత్ సంతృప్తిగా లేరని, అందుకే సుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే, 'తలైవా 173' నుండి సుందర్ సి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ని తీసుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు కోరుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



