ట్రైలర్ రివ్యూ: ధృవ
on Nov 25, 2016
.jpg)
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్‌చరణ్.. ఇప్పుడు ధృవని టార్గెట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే, ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 9న విడుదల కాబోతోంది. ఇప్పుడు ట్రైలర్‌ని బయటకు వదిలారు. ట్రైలర్ చూస్తుంటే సేమ్ టూ సేమ్ తని ఒరువన్‌ని తెలుగు డైలాగులతో చూసినట్టే ఉంది. అయితే... రామ్‌చరణ్ మేకొవర్, సురేందర్ రెడ్డి స్టైలీష్ మేకింగ్, భారీ నిర్మాణ విలువలు, రిచ్ మేకింగ్ ఇవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. తని ఒరువన్‌చూడని వాళ్లకు మాత్రం ఇదో కొత్తరకం సినిమా అనిపించకమానదు. ఇలాంటి కథని ఎంచుకొని చరణ్ మంచి నిర్ణయమే తీసుకొన్నాడు. రెగ్యులర్ కథలకు భిన్నంగా సాగే సినిమా ఇది. చరణ్ డైలాగ్ డెలివరీ, స్టైల్ ఇవన్నీ కొత్తగా కనిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా అరవింద్ స్వామి స్క్రీన్ ప్రెజెన్స్, అతని నవ్వు కట్టిపడేస్తాయి. తని వరువన్ సినిమాని నిలబెట్టింది కూడా అరవింద్ స్వామినే. అందుకనే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ .. అరవింద్ స్వామిని తీసుకొన్నారు. ట్రైలర్‌లోఇంట్రస్టింగ్ పాయింట్స్ చాలానే కనిపిస్తున్నాయి. చరణ్ ఫ్యూచర్, కెరీర్ మార్చే సినిమాగానే 'ధృవ' తోస్తోంది. ట్రైలర్ వరకూ హిట్ అనిపించుకొన్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



