అమలాపాల్ చేసిన తప్పు అదే!
on Nov 26, 2016

అమలాపాల్ టాలీవుడ్‌లో తాను చేసిన సినిమాలతో సంపాదించిన పాపులారిటీ కంటే.. విజయ్ వివాహబంధానికి గుడ్ బై చెప్పేశాక సంపాదించిన పబ్లిసిటీనే ఎక్కువ. అంతగా ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎందుకు విడిపోయారా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ బ్రేకప్‌కి కారణం చెప్పనని విజయ్ ముందేచెప్పాడు. కనీసం అమలాపాల్ అయినా నోరు విప్పిందా అంటే అదీ లేదు. `విజయ్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. తనపై ప్రేమ చావదు` అంటూ సినిమాటిక్‌డైలాగులు చెబుతోంది. ''విజయ్‌ని పెళ్లి చేసుకొని తప్పు చేయలేదు. కానీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ బంధాన్ని అర్థం చేసుకొనే మెచ్చూరిటీ నాకింకా రాలేదు. అందుకే ఇంత త్వరగా విడిపోయాం'' అంటూ పరోక్షంగా ఈ విడాకులకు కారణం తానే అని చెప్పకనే చెప్పింది. అయితే ఇప్పుడు అమలాపాల్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించిందట. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూనే ఉంటానని, ఆఫర్లు కూడా వస్తున్నాయని చెబుతోంది. తమిళంలో సరే... తెలుగులో ఈ ఆంటీకి సినిమాలిచ్చేవాళ్లెవరు? టాలీవుడ్‌లో అమలాపాల్ని పట్టించుకొనేదేవరు?? తెలుగు సీమపై అమలాపాల్ ఆశలు వదులుకోవడమే మంచిదేమో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



