'గ్రీకువీరుడు'లో అబ్బాయి గెటప్ వేసుకుని...
on Jul 28, 2020

శర్వానంద్ సరసన 'రన్ రాజా రన్'లో నటించిన, రీసెంట్‌గా 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో హీరోయిన్‌గా మరో హిట్ అందుకున్న సీరత్ కపూర్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. హిందీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. తెలుగులో అడపాదడపా హీరోయిన్‌గా చేస్తున్న, విజయ్ దేవరకొండ సరసన 'ద్వారకా'లో నటించిన పూజా జవేరి కూడా ఒకప్పుడు కొరియోగ్రాఫరే. డాన్సు నుండి యాక్టింగ్‌లో వచ్చిన ఈ లేడీ కొరియోగ్రాఫర్ల జాబితాలో చేరడానికి యాని మాస్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తెలుగులో సుమారు 50 పాటలకు యాని కొరియోగ్రఫీ అందించారు. ఈటీవీలో ప్రసారం అయ్యే డాన్స్ బేస్డ్ షో 'ఢీ'లో జడ్జ్ గా ప్రేక్షకులకు తెలుసు. మంచి రోల్ వస్తే యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఛాట్ సెషన్‌లో యాని చెప్పుకొచ్చారు. ఒకవేళ కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే ఆర్మీలో జాయిన్ కావడమో, పోలీస్ అవ్వడమే చేసేదాన్ని అని ఆమె అన్నారు. ఒక పాట కోసం అబ్బాయి గెటప్ వేసుకున్నానని యాని తెలిపారు.
"గ్రీకువీరుడు సాంగ్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాం. అక్కడ స్విస్ డాన్సర్ ఒకరు మంచిగా చేయలేదు. అప్పుడు అబ్బాయి గెటప్ వేసుకుని 'ఓ బేబీ మై లవ్' పాటలో డాన్సర్‌లా చేశా" అని యాని అన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసేటప్పుడు గ్రూప్ డాన్సర్లలో కలిసిపోయి స్టెప్పులు వేసేదాన్ని అని ఆమె తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



