ఒకే వేదికపై పవన్, చిరు..!
on Sep 28, 2014
మెగా అభిమానులు చాలా రోజులుగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరికను తీర్చబోతున్నాడు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ముకుంద’ ఆడియో వేడుక అక్టోబర్4న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ వేదికపైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారని సమాచారం. అయితే చాలాకాలంగా మెగా అభిమానుల మధ్య విభేదాలున్నాయని మీడియాలో వస్తున్న వార్తలకు ముకుందుడు చెక్ పెట్టబోతున్నాడని మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.