మామ బర్త్ డే కి ఉపాసన గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా..?
on Aug 22, 2017
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజే. ఒక్క మెగా అభిమానులకే కాదు.. మెగా కుటుంబసభ్యులకు కూడా ఈరోజు స్పెషల్ డే. ఇక చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులు ఊరుకుంటారా.. కేక్ కటింగ్ లు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు.. ఇలా చిరంజీవి పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చిరు బర్త్ డే కి తనయుడు రాం చరణ్ గిఫ్ట్ ఇవ్వడం కామన్. అయితే ఈసారి చరణ్ భార్య ఉపాసన చిరు బర్త్ డే కి అదిరిపోయే బహుమతి ఇచ్చిందట. అదేంటంటే.. ఉపాసన ఓ ప్రామిస్ చేసిందట. మామయ్య చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తాను ప్రయత్నిస్తానని.. మామయ్య బర్త్ డే కి నేను ఈ ప్రామిస్ చేస్తున్నానని ఉపాసన తెలిపారు. మరి ఉపాసన ఇచ్చిన గిఫ్ట్ మామయ్య నచ్చుతుందా అంటే నచ్చకుండా ఎలా ఉంటుంది మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
