అయోధ్యకి చిరంజీవి చరణ్... బయలుదేరే ముందు ఊహించని గిఫ్ట్
on Jan 22, 2024

ఇప్పుడు భారతదేశం మొత్తం జై శ్రీరామ్ అనే నామజపంతో ఊగిపోతోంది. 400 సంవత్సరాల తర్వాత సీతాపతి శ్రీ రామ చంద్రుడికి ఆయన జన్మ స్థలమైన అయోధ్య (ayodhya)లో రామ మందిరాన్ని నిర్మించడంతో పాటు ప్రాణప్రతిష్ట కూడా జరుగుతుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi)అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan) లు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలిద్దరికి ఇచ్చిన గిఫ్ట్ టాక్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యింది.
అయోధ్య లో జరిగే రామ మందిర కార్యక్రమానికి చిరు అండ్ చరణ్ లు ఒక రోజు ముందుగానే బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో వారు బయలుదేరే ముందు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. అనంతరం చిరంజీవి, చరణ్ లని కలిసి తమిళనాడు లోని తంజావూరు కి చెందిన ప్రఖ్యాత శిల్పి అమర నాధ్ రూపొందించిన హనుమాన్ కాంస్య విగ్రహాన్ని చిరు అండ్ చరణ్ లకి బహుకరించారు. హనుమాన్ కాంస్య విగ్రహాన్ని చూడగానే భక్తితో తన్మయత్వం చెందేలా ఉంది. అనంతరం అభిమానులతో చిరు చరణ్ లు కాసేపు ముచ్చటించి అయోధ్య బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

చిరంజీవి, చరణ్ అనే రెండు పేర్లు కూడా ఆంజనేయుడివే కావటం విశేషం. చిరు ప్రస్తుతం విశ్వంభర (viswambara)అనే కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే చరణ్ గేమ్ చేంజర్ (game changer) షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రభాస్ లు కూడా హాజరవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



