సంక్రాంతికి రామ్‌చరణ్ రాకపోతే చిరంజీవి?
on May 3, 2020

సంక్రాంతికి కొత్త సినిమాతో థియేటర్లలోకి రావడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్'తో వచ్చే ఏడాది జనవరి 8న సందడి చేయనున్నారు. ప్రస్తుతానికి రాజమౌళి ప్లాన్ అయితే ఇదే! కానీ, కరోనా ఎఫెక్ట్ వల్ల సకాలంలో సినిమా షూటింగ్ పూర్తి కాకపోతే? సంక్రాంతికి సినిమా రెడీ కాకపోతే? మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతారని ఇండస్ట్రీ గుసగుస.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఆగస్టులో థియేటర్లలోకి తీసుకురావాలని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇండిపెండెన్స్ డే నాడు సినిమా ప్రేక్షకులు ముందు ఉంచాలనేది ప్లాన్. అయితే, అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా పైనా కరోనా ఎఫెక్ట్ పడింది. సుమారు రెండు నెలలుగా షూటింగులు జరగడం లేదు. ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 'ఆచార్య' రెడీ కావడం దాదాపు అసాధ్యమే. ప్రస్తుత పరిస్థితి మరో రెండు మూడు నెలలు కొనసాగితే... సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' కూడా రెడీ కాదు. తెలుగు సినిమాలకు మంచి సీజన్ ఆయన సంక్రాంతిని వదులుకోవడం ఎందుకు? ఒకవేళ రామ్ చరణ్ సినిమా రెడీ కాకపోతే తన సినిమాను రెడీ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట!
ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడితే... 'ఆచార్య' మాత్రమే కాదు మరి కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



