తెలంగాణ పోలీస్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకుంటున్న బెల్లంకొండ!
on Jan 2, 2024
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 10వ సినిమాని 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్.
'BSS10' మూవీ టైటిల్, ఫస్ట్ లుక్, లింప్స్ ను జనవరి 3న ఉదయం 11:20 కి రివీల్ చేయనున్నట్లు మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నిన్న(సోమవారం) ప్రకటించారు. ఇక తాజాగా "ప్రజాహితముకై జారీ చేయడమైనది" అంటూ "తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్" తరహాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ డీఎస్పీగా కనిపించనున్నాడని, త్వరలోనే ఛార్జ్ తీసుకోబోతున్నాడని అందులో పేర్కొన్నారు. మరి డీఎస్పీగా బెల్లంకొండ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాకి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
