అల్లరోడి ఆరుకోట్లు మటాష్
on Feb 27, 2015
పాపం.. అల్లరి నరేష్‌కి ఏదీ కలసి రావడం లేదు. ఈ మధ్య ఒక్క హిట్టూ పడక... దిగాలుపడిపోయాడు. కామెడీ హీరోగా నరేష్ కి బోలెడంత పేరుండేది. మినిమం గ్యారెంటీ హీరో అని చెప్పుకొనేవారు. మూడు, నాలుగు కోట్లతో సినిమా తీసి... ఓ కోటి వెనకేసుకొనేవారు ప్రొడ్యూసర్లు. సినిమా ఎలా ఉన్నా.. లాభాలు మాత్రం వచ్చేవి. చేతినిండా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా ఉండేవాడు. కానీ ఆ వైభవం ఏది??? హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బెడసికొడుతున్నాయి. నరేష్ నవ్వించలేకపోతున్నాడు. పోనీ ప్రయోగాలు చేద్దామనుకొంటే చేతులు కాలిపోతున్నాయ్. లడ్డూ బాబు చూశారు కదా.. ఎంత చేదుగా ఉందో..?? కాస్త క్లాసీటా ఉంటుందని బందిపోటు తీస్తే.. అదీ లాసొచ్చింది. ఈ సినిమాకి నరేష్ వి రూ.6 కోట్లు పోయాయట. సొంత నిర్మాణ సంస్థ ఈవీవీ సినిమాపై తీసిన సినిమా ఇది. పారితోషికం పక్కన పెట్టి సినిమా తీస్తే ఆరు కోట్లు ఖర్చయ్యాయి. తీరా సినిమా పూర్తయ్యాక ఎవరూ కొనలేదు. ఇంద్రగంటి పేరూ ఎవ్వరినీ ఆకర్షించలేదు. శాటిలైట్ అమ్ముడుకాలేదు. మొత్తానికి నరేష్ ఓన్ రిలీజ్ చేసుకొన్నాడు. కానీ రెండో రోజు నుంచే డెఫ్ షీట్స్ మొదలయ్యాయి. థియేటర్ల కు అద్దెలు ఎదురిచ్చాడు. సోమవారం నుంచి నావల్ల కాదని చేతులు ఎత్తేశాడు. దాంతో బందిపోటు నరేష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. సినిమా టాక్ చూసి నరేష్ కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదు. ఈ సినిమాకి ఎంత చేసినా వేస్టే అనుకొన్నాడేమో.. ఆ తరవాత రూపాయి కూడా బయటకు తీయలేదు. నరేష్ ఇప్పుడు సిందిగ్థావస్థలో ఉన్నాడు.. నవ్వించలేకపోతున్నాడు. అలాగని సీరియస్ - క్లాసీ సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూడడం లేదు. నరేష్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ తనదైన దారిలో వెళ్లి, తనకు నప్పే కథల్ని, సరికొత్త కామెడీ యాంగిల్‌తో చూపిస్తే తప్ప జనం చూడరు. మరి ఈ ప్రమాదం నుంచి నరేష్ ఎలా బయటపడతాడో ఏంటో??

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
