Home

»

Latest News

బాలయ్య ‘దాదా’ వాయిదా: క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.!

Nov 5, 2026 5:06PM

నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరోసారి రిలీజ్ డేట్ టెన్షన్ మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దాదా' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, బాలయ్యకు గతంలో గాయం కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది.

నిజానికి ఈ సినిమాను మొదట దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ కాకినాడ పోర్టులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణకు గాయమైంది. దీంతో ఆయన కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. షూటింగ్ ఆలస్యం కావడంతో క్రిస్మస్‌కు వాయిదా వేశారు. 

గాయం నుంచి కోలుకున్న తర్వాత బాలయ్య తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. మైసూర్ షెడ్యూల్‌తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. అయితే కాకినాడలో చిత్రీకరించాల్సిన కొన్ని ఫైట్ సన్నివేశాలకు వర్షాలు, తుఫాను ఆటంకంగా మారినట్లు సమాచారం.

ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 24 నాటికి అన్ని పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.!

అయితే ఈ వాయిదా ప్రచారంపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. 'దాదా' విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 24నే సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది. టీమ్ చేసిన ప్రకటనతో వాయిదా వార్తలకు ప్రస్తుతానికి తెరపడింది.

'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై మంచి అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: 
బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?    
బిగ్ సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్ 2’.!

 

 

 

[Dada Postponement Rumours, Balakrishna Dada Movie, NBK Dada Movie, Dada Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com