మరి తెలుగు ట్రైలర్ ఎప్పుడు.. హిందీలోనే ముందు ఎందుకు
on May 2, 2024
ఇండియన్ సినిమా ఉన్నంత కాలం బాహుబలి (Bahubali)గురించి చెప్పుకుంటునే ఉంటారు. కాకపోతే తెలుగు వాళ్ళు ఇంకొంచం ఎక్కువగా చెప్పుకుంటారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ యవనిక మీద కూర్చోపెట్టి ఆస్కార్ ని కూడా అందించింది. అలాంటప్పుడు బాహుబలి గురించి నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. మూవీ గురించి ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా సరే ఇంట్రెస్టింగ్ గా ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో బాహుబలి కి సంబంధించిన ఇంట్రెస్ట్ న్యూస్ పలువురిని ఆకర్షిస్తుంది
బాహుబలి సిరీస్ 2015 ,2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు సిసలు పాన్ ఇండియా మూవీగా నిలిచి రికార్డు కలెక్షన్స్ ని సాధించింది.చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు బాహుబలికి బ్రహ్మ రధం పట్టారు. తాజాగా బాహుబలి కి యానిమేటెడ్ సిరీస్ రాబోతుందనే విషయం అందరకి తెలిసిందే. దానికి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ( bahubali crown of blood)అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు.ఇప్పడు దాని ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డిస్ని + హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
ట్రైలర్ చూస్తున్నంత సేపు యానిమేటెడ్ సిరీస్ ని మంచి క్వాలిటీతో చేశారనే విషయం అర్ధమతుంది. ఈ నెల 17 నుంచి డిస్ని + హాట్ స్టార్ లోనే టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్నీ కూడా అధికారకంగా ప్రకటించారు. కాకపోతే ఓన్లీ హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇనిస్టాగ్రమ్ లో ట్రైలర్ రిలీజ్ చేసారు. హిందీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే యానిమేటెడ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు