Bad Newz OTT : ఓటీటీలోకి యానిమల్ హీరోయిన్ మూవీ!
on Aug 30, 2024
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ' యానిమల్(Animal) ' మూవీ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. 'యానిమల్' మూవీతో హీరోయిన్ రష్మిక మందన కి ఎంత క్రేజ్ వచ్చిందో .. సెకెండ్ హీరోయిన్ గా చేసిన త్తిప్తి దిమ్రీకి అంతే క్రేజ్ వచ్చింది.
త్రిప్తి దిమ్రీ నటించిన ఓ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ' బ్యాడ్ న్యూజ్ ' . జూలైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ కి నవ్వులు పంచిన ఈ ' బ్యాడ్ న్యూజ్' .. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon prime vedio) లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రస్తుతానికి రెంటల్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే 349 రూపాయల అద్దె ప్రాతిపదికన ఈ మూవీని చూడొచ్చన్నమాట.
యానిమల్ మూవీతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ.. బ్యాడ్ న్యూజ్ మూవీలో సలోని బగ్గా పాత్రలో మెరిసింది. అమీ ఆర్క్ నేహా ధూపియా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కథేంటంటే.. సలోని బగ్గాకి వంటలు చేయడం ఇష్టం. అందులోను వంటల పోటికి వెళ్ళి.. అందులో అత్యుత్తమ ప్రదర్శన చేసి ' మెరాకీ స్టార్ పురస్కారం' గెలవాలని సలోని కలలు కంటుంది. అయితే ఆమెని ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఢిల్లీలోని కరోల్ బాగ్ కి చెందిన ఓ షాప్ ఓనర్ అఖిల్ చద్దా( విక్కీ కౌశల్) కి ఇచ్చి పెళ్ళి చేస్తారు. అయితే అఖిల్ చద్దా, సలోని హానిమూన్ కి వెళ్ళినప్పుడు వారి మధ్య గొడవ జరుగుతుంది. ఇక ఇద్దరు విడాకుల వరకు వెళ్తారు. ఇదే సమయంలో సలోని ఓ హోటల్ నిర్వాహకుడైన గుర్ బీర్ పన్ను( అమీ విర్క్ ) కి దగ్గరవుతుంది. దాంతో సలోని ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ మూవీని ఓ సారి ట్రై చేయ్యండి.
Also Read