నాన్నా రాజమౌళి.. ప్రభాస్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు!
on Oct 27, 2025

- బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ
- ప్రోమోలో నవ్వులు పూయించిన బాహుబలి త్రయం
అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతాన్ని 'బాహుబలి' రూపంలో టాలీవుడ్ చూసింది. అయితే ఆ అద్భుతం వెనుక.. మనకి తెలియని మరెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.
తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'బాహుబలి' అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలూ కలిపి ఒకటే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెడుతోంది. (Baahubali: The Epic)
'బాహుబలి' రీ రిలీజ్ సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళితో కలిసి ప్రభాస్, రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
"బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాలి అనే దానికంటే.. ఆ నిర్ణయానికి కట్టప్ప ఎప్పుడు వస్తాడు?" అనే పాయింట్ దగ్గరే తాను ఆగిపోయినట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. "నాన్నా రాజమౌళి.. ప్లీజ్ అది వేయండి" అంటూ ఒక విషయంలో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేయడం సరదాగా ఉంది. "కిరీటం మీద చేయి పెట్టి మాట్లాడిన రోజే.. అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను" అంటూ భల్లాలదేవ పాత్రను తాను ఎంతలా ఓన్ చేసుకున్నది రానా తెలిపాడు.
మొత్తానికి కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నవ్వులతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో భలే ఉంది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.
Also Read: స్టార్ కిడ్ చేతికి విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



