స్టార్ కిడ్ చేతికి విజయ్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్..!
on Oct 27, 2025

- 'ఎల్లమ్మ' బాటలో 'జటాయు'
- దిల్ రాజు భారీ ప్రాజెక్ట్ లో ఆ యంగ్ హీరో
ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్, మరో హీరోకి వెళ్ళడం అనేది చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు కాంపౌండ్ లో ఇది ఎక్కువగా వినిపిస్తోంది. 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ విషయానికొస్తే.. నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. అలాగే ఇప్పుడు 'జటాయు' కూడా ఓ కొత్త హీరో తలుపు తట్టినట్లు తెలుస్తోంది. (Jatayu)
విజయ్ ప్లేస్ లో రోషన్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'జటాయు' అనే ఓ భారీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు కొంతకాలం క్రితం ప్లాన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ నటించే అవకాశముందని ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే ఇతర స్టార్స్ పేర్లు వినిపించినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండతో చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారని ప్రముఖంగా వినిపించింది. దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం విజయ్ 'రౌడీ జనార్దన్' అనే సినిమా చేస్తున్నాడు. కానీ, 'జటాయు' ఊసు మాత్రం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చర్చ లేదు. ఇలాంటి సమయంలో.. సడెన్ గా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ నుండి కొత్త పాన్ ఇండియా హీరో
నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందD సినిమాలలో నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. తన లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అనే పేరు సంపాదించుకున్నాడు. సరైన సినిమా పడితే రోషన్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు తెలుగు సినీ అభిమానుల్లో ఉన్నాయి. ప్రస్తుతం వైజయంతి బ్యానర్ లో 'ఛాంపియన్' అనే సినిమా చేస్తున్నాడు రోషన్. ఇక ఇప్పుడు 'జటాయు'లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. 'జటాయు' పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా విజయం సాధిస్తే.. రోషన్ రూపంలో టాలీవుడ్ నుండి మరో పాన్ ఇండియా హీరో వచ్చినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also Read: రవితేజ ఫ్యాన్స్ కి ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



